Easy Weight Loss Tips( Easy గా బరువును తగ్గించడానికి)
Easy Weight Loss Tips( Easy గా బరువును తగ్గించడానికి)
యాలకలు --3
బెల్లం --1కప్పు
కొబ్బరి తురుము --2 టేబుల్ స్పూన్
నెయ్యి --1 టేబుల్ స్పూన్
పొయ్యి పైన కడాయి పెట్టి పెసలు అందులో వేసి గరిటతో తిప్పుతూ దోరగా వేయించుకోండి . కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రంగు మారాక అందులో మూడు యాలకలు వేయండి పెసలు కొంచెం కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ జార్ లో వేసి బాగా పొడి చేసుకోండి. పొయ్యి పైన గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోయాలి బెల్లం కరిగి తీగపాకం వస్తే చాలు,ఇప్పుడు మనం మిక్సీ లోచేసుకున్న పొడిని ఒక ప్లేట్లో వేసుకోండి .(మరీ నున్నగా పౌడర్ అయితే నోటికి కరుచుకు పోతుంది కాబట్టి కొంచెం గరుకుగా పప్పులపొడి ఉండేలా చూసుకోండి).
ఇప్పుడు వాటిలో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసి కలపండి తరువాత కొంచెం కొంచెం పాకం పోసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తరువాత పెద్ద ఉసిరికాయ సైజులో లడ్డూలను పట్టండి. కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేక ఆయిల్ వేసుకోవచ్చు . ఇవి 15 నుండి 20 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా బాక్స్ లేక కంటైనర్లో వేసి పెట్టుకొని రోజుకు ఒకలడ్డూ తినండి . ఇది లేడీస్ , జెంట్స్ ఇద్దరూ తినవచ్చు.
Note: బాక్స్ లో నీళ్లు లేకుండా చూసుకోవాలి ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే మూడు రోజులకు బూజు పడుతుంది
Comments
Post a Comment