జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి Hair Loss Tips
జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి :-
(Hair Loss Tips)
నువ్వులు - 1కప్పు
అలసందలు -1కప్పు
బాదం లేక వాల్నట్
-1కప్పు
బెల్లం - 1కప్పు
యాలకలు -4
నీళ్లు - ¼ కప్పు
నూనె -2 టేబుల్ స్పూన్
పొయ్యి పైన కడాయి పెట్టి దానిలో రెండు టేబుల్
స్పూన్ ఆయిల్ పోయాలి .పది సెకండ్ల
తరువాత వాటిలో నువ్వులు అలసందలు వేసి బాగా వేయించుకోవాలి .(నువ్వులలో క్యాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది. అలసంద గింజలలో మన జుట్టుకు కావలసిన విటమిన్స్ ,ప్రోటీన్స్, ఒమేగా పాట్స్
ఉంటుంది. జుట్టుకు ఆరోగ్యాన్ని కలిగించే న్యూట్రియన్స్
అన్ని అలస గింజలలో ఉంటుంది .అలస గింజలలో
క్యాల్షియం ఉంటుంది .క్యాల్షియం డెఫిషియెన్సీ
ఉన్నా కూడా జుట్టు ఊడుతుంది. ముఖ్యంగా
డెలివరీ అయ్యాక ఫీడింగ్ ఇచ్చే తల్లులకు క్యాల్షియం డెఫిషియెన్సీ వల్ల జుట్టు బాగా
ఊడిపోతుంది .)నువ్వులు ,అలసంద గింజలు వేయించి ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత కడాయిలో బాదం లేక వాల్నట్ ఒక కప్పు
వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి . పొయ్యి పైన గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి
పావుకప్పు నీళ్లు పోయాలి బెల్లం కరిగి తీగపాకం వస్తే చాలు, అంతలోపు మనం వేయించుకున్న బాదం, అలస గింజలు ,నవ్వులు మిక్స్
ని 4 యాలకలు వేసి మిక్సీలో గ్రైండ్
చేసుకోవాలి .(వేడిగా
ఉన్నప్పుడు మిక్సీ వేయకండి, మిక్సీ
తిరిగేటప్పుడు ఇంకా వేడి ఎక్కువ అవుతుంది .అప్పుడు మిక్సీ
జార్ పైన మూత ఊడిపోయి పైన పడే ప్రమాదం ఉంది . యాలకలు ఫ్లేవర్
కోసం వేసాము , యాలకలు వేస్తే
బాగుంటుంది. లేకపోయినా పరవాలేదు) నువ్వు ఉండటం వల్ల కొంచెం పౌడర్ చిక్కగా
వస్తుంది ఎందుకంటే నువ్వు లలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం పాకం
చేర్చుకొని బాగా కలిపి ఒక అరగంట వదిలేయండి అప్పుడు అవి కొంచెం గట్టి పడుతుంది
ఇప్పుడు పెద్ద ఉసిరికాయ సైజులో లడ్డూలను పట్టండి .ఇవి 15 నుండి 20 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా
బాక్స్ లేక కంటైనర్లో వేసి పెట్టుకొని రోజుకు ఒకలడ్డూ తినండి . ఇది లేడీస్ , జెంట్స్ ఇద్దరూ తినవచ్చు.
Note: బాక్స్ లో నీళ్లు లేకుండా చూసుకోవాలి ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే మూడు రోజులకు బూజు
పడుతుంది
Comments
Post a Comment