స్కిన్ మెరవాలంటే (Skin Glow Tips)
స్కిన్ మెరవాలంటే (Skin Glow Tips)
రాగి పిండి --½ కప్పు
బెల్లం --1కప్పు
సజ్జ పిండి /జొన్నపిండి --½ కప్పు
నెయ్యి /నూనె --1 టేబుల్ స్పూన్
యాలకల పొడి –1/2 టేబుల్ స్పూన్
స్టౌ పైన కడాయి పెట్టి పల్లీలు (వేరుశనగ) వేసి దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి (ఆయిల్ లేక నెయ్యిని వేయకండి .ఎందుకంటే మనం వాటి పొట్టును తీసేయాలి ఆయిల్ నెయ్యి వేస్తే పొట్టు అంత తొందరగా రాదు) ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఆరనివ్వండి .స్టౌ పైన పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేక నూనె వేసి అందులో అర కప్పు రాగి పిండి ,అర కప్పు సజ్జ పిండి లేక జొన్నపిండి వేసుకోండి. ఒకవేళ సజ్జపిండి లేక జొన్నపిండి లేదు అంటే గోధుమపిండి వేసుకోవచ్చు. వీటిని గరిటతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.
స్టౌ ని సిమ్ము లో పెట్టడం మర్చిపోకండి. హై లో పెడితే మాడిపోతుంది. పిండిని ఐదు నిమిషాలు వేయించి కున్నాక తీసి ప్లేట్ లో పక్కన పెట్టి చల్లారనివ్వండి . కడాయి లోనే పెట్టినట్లయితే ఆ హీట్ కి పిండి మాడిపోతుంది కాబట్టి తీసి ప్లేట్ లో వేసి ఆరనివ్వండి .ఇప్పుడు మనం ఇంతకుముందు చల్లారని ఇచ్చిన పల్లీలను పొట్టుతీసి శుభ్రం చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొండి. .(మరీ నున్నగా పౌడర్ అయితే నోటికి కరుచుకు పోతుంది కాబట్టి కొంచెం గరుకుగా పప్పులపొడి ఉండేలా చూసుకోండి).
ఇప్పుడు వీటిని కూడా ఆ రాగి పిండి మిక్సింగ్ లో కలిపి, అర స్పూన్ యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు వెయిట్ చేసి బాగా కలపండి . స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఒక కప్పు బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోయాలి బెల్లం కరిగి తీగపాకం వస్తే చాలు, పల్లీలలో ఆటోమేటిక్ గా కొంచెం నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ పాకం అవసరం లేదు లైట్ గా పాకం వేసి కలుపుకోండి కొంచెం కొంచెంగా కలుపుకొని రెండు నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఆ తడి మొత్తం ఆవిరైపోతుంది వాటిని మళ్లీ ఒకసారి కలుపుకొని ఉసిరికాయ సైజులో లడ్డూలను పట్టండి. వీటిని రోజుకి రెండు లడ్డూలు తింటే మీ స్కిన్ 7 రోజుల్లో మెరవడం గమనించవచ్చు .
Comments
Post a Comment